BREAKING
48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం

పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి

​ఎస్.రాయవరం, నవంబర్ 23, మేజర్ న్యూస్:
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ కల్పించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు జనసేన రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరక్టర్ పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు బోడపాటి శివదత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
సోమవారం నాడాయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమిలో సీట్ల పంపకాలు కేవలం మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు ఎవరైనా సరే తమ కుటుంబ బలాలు, స్థానికంగా ఉన్న ఓట్ బ్యాంక్ ఆధారంగా స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని సూచించారు.
​పాయకరావుపేట నియోజకవర్గంలోని జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళల్లో ఎవరైతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేశారో, వారందరికీ జనసేన నాయకత్వం తరఫున పూర్తి మద్దతు లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలోనూ, ఇతర విషయాల్లోనూ ఎటువంటి సహకారం కావాలన్నా తాము అండగా నిలబడతామని బోడపాటి స్పష్టం చేశారు.