BREAKING
48 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆర్. పీ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తా పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు..

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత  బాలభూపాల నాయుడు..

 

నరసన్నపేట నవంబర్ 23 మేజర్ న్యూస్:
నరసన్నపేట పట్టణ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ఎంఎల్ఆర్ నాయుడు విద్యాసంస్థల అధినేత ముద్దాడ బాలభూపాల నాయుడు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ధర్మాన అప్పారావు, దిబ్బ శ్రీనివాసరావు, సుంకాన గణేష్, ముద్దాడ నీలయ్య తదితరులు సహా మొత్తం 15 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి.

ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షులు ఆరంగి మురళిధర్, మాజీ ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి బురల్లి శంకర్ రావు, ఎంపీటీసీ పాగోటి భరత్ కుమార్, పట్టణ అధ్యక్షులు పొట్నూరు సాయి ప్రసాద్, ముద్దాడ అప్పలనాయుడు, ముద్దాడ చంటి తదితర స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.