ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా! జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య
రాయికోడ్;తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనుంది.అని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య తెలిపారు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులకు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు తీసుకొని రావలసిందిగా కోరారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.పథకం ముఖ్యాంశాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భరోసా. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం.18–59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ సభ్యులకు సంబంధించిన బీమా సదుపాయం.కలదు అని తెలిపారు ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకం అమలుకు అవసరమైన వివరాలు, అర్హతలు మరియు విధివిధానాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. అన్నారుప్రగతి పథం… సంక్షేమ బాట… మన ప్రజా ప్రభుత్వం!తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య తెలిపారు