BREAKING
రష్యా ఉపగ్రహ వార్తలపై నాటో స్పందన శంషాబాద్‌లో కల్తీ మద్యం దందా గుట్టురట్టు! పుష్కరాల పనులను వేగవంతం చేయాలి * నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.. అధికారులకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించడంపై ఎన్విడియాపై చట్టసభ సభ్యుల విమర్శలు ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునరాగమనం ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందేలా చర్యలు అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ ధాన్యం, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి * అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి రవికుమార్ కొలత పట్టకుంటే.. ట్రాఫిక్ నియంత్రణ కష్టమే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి - అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ . నారాయణపురంలో ఆర్కే రాజు ప్రచార హోరు... గెలుపే లక్ష్యంగా ముందుకు. గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ వేడుకల ముందు భారత్-నేపాల్ మధ్య 10 స్తంభాల ఉమ్మడి విజన్

ధాన్యం, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి * అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం

Select Suryaa Now
ధాన్యం, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి   * అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం

 

సూర్య - పెద్దపల్లి : జిల్లాలో ఖరీఫ్ ధాన్యం, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి, నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ట్రక్‌షీట్లు, మిల్లుల రసీదుల జారీలో జాప్యం లేకుండా చూడాలన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు పాటించాలని, తేమ శాతాన్ని బట్టి లభించే మద్దతు ధర వివరాలు రైతులకు తెలిసేలా జిన్నింగ్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.