BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం*

Select Suryaa Now
హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం*

కోహెడ;గోల్కొండ, తెలంగాణ తొలి సమాజ తత్వకవి అయినటువంటి సిద్ధప్ప వరకవి రాజయోగి గురుపూజోత్సవం మంగళవారం గుండారెడ్డిపల్లి గ్రామంలోని సిద్ధప్ప ఆశ్రమంలో నిర్వహిస్తున్నట్లు సిద్ధప్ప కళాపీఠం ప్రతినిధి అనంతవరం మాణిక్యలింగం తెలిపారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం సిద్ధప్ప చిత్రపటంతో భక్తుల ఆధ్వర్యంలో వాడ వాడలా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి, ఆశ్రమం చేరుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఆంజనేయ స్వామి అభిషేకం, తులసిపూజ, గాయత్రి యజ్ఞం, సరస్వతి పూజ, సిద్ధప్ప సమాధి వద్ద సమారాధన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, భజనలు, ఆధ్యాత్మిక ఇష్టాగోష్ఠులు, ప్రసంగాలు ఉంటాయన్నారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మాణిక్యలింగం కోరారు. *పాఠ్యాంశంగా  సిద్ధప్ప సాహిత్యం:*తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో సిద్ధప్ప కవి కళాతోరణం ఏర్పాటు చేయడంతోపాటు, "తెలంగాణ తేజోమూర్తి"గా గుర్తించబడ్డారు. తొమ్మిదవ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా తన జీవితం సాహిత్యం కొనసాగించడం సిద్ధప్పకు దక్కిన అపూర్వ గౌరవం.*శనిగరం జలాశయాన్ని* ఆనుకొని, కొండలు, గుట్టలు, పచ్చదనం ఉట్టిపడే ఎత్తైన ప్రాంతంలో గల సిద్ధప్ప ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. *సిద్ధప్ప వరకవి రచనలు:*దాదాపు నలభై గ్రంథాల వరకు రచించిన సిద్ధప్ప గారి రచనల్లో "సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని" నాలుగు సంపుటాలు బహుళ ప్రజాదరణ పొందాయి. కాకిహంసో పాఖ్యానము,జీవనరేంద్ర డ్రామా,అశోక సామ్రాజ్యం యక్ష గానం,శివస్తుతి,విష్ణు భజనావళి,నీతి శాస్త్రం,వర్ణమాల కందార్థాలు,గోవ్యాగ్ర సంభాషణ,బిక్కనవోల్ కందార్థాలు,యాదగిరి భజనావళి  వంటి గ్రంధాలను రచించి,దాదాపు అన్ని పద్య ప్రక్రియలతో పాటు యక్షగానం, స్తోత్రాలు ,వర్ణమాల,దండకాలు,సుభాషితాలు హితబోధ,వేదాంత తత్వ కీర్తనలు,కాలజ్ఞానం, నక్షత్రమాల, నాటకాలు వంటి ఎన్నో రచనలు చేశారు.