డీఆర్డీఓ అధికారి నర్సింగ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
ధారూర్,మేజర్ న్యూస్:ఇటీవల నూతనంగా వికారాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా,డీఆర్డీఓ అధికారి నర్సింగ్ రావును ధారూర్ టౌన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ దావూద్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు పలు అంశాలపై కాసేపు ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో దావూద్‌తో పాటు నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావలి కాశీరాం,ధారూర్ ఏపీఓ రాములు తదితరులు పాల్గొన్నారు.