BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

*మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు!*

Select Suryaa Now
*మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు!*

చేర్యాల;చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా భవనం పనులతో పాటు గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన గణేష్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ శెట్టి కొమురయ్య వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రణయ్‌కు వినతిపత్రం అందజేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా భవనం పనులను సర్పంచ్ స్వయంగా కాంట్రాక్టు తీసుకుని, నిర్మాణ సామగ్రి రవాణా కోసం గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ను వినియోగించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బందిని సైతం వ్యక్తిగత నిర్మాణ పనులకు ఉపయోగించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.అలాగే గ్రామ ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ట్యాంకును వినియోగించుకున్నప్పటికీ సంబంధిత బిల్లులు చెల్లించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కూడా సర్పంచ్ కాంట్రాక్టు తీసుకుని నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేపడుతున్నారని ఫిర్యాదులో వివరించారు.ఈ వ్యవహారాలన్నింటిపై అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గణేష్ కోరారు.గ్రామపంచాయతీ నిధులు, వనరుల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు చేపట్టబోయే విచారణపై గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది.