53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం...
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం...
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధే లక్ష్యం: శంకర్ యాదవ్
తిరుపతి నగరపాలక సంస్థకు ఇటీవల ఎన్నికైన నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం తిరుపతిలోని ఎస్.వి. శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన శంకర్ యాదవ్‌కు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన 53వ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, డివిజన్‌లో నెలకొన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధిదీపాలు తదితర మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, తిరుపతిని అన్ని రంగాల్లో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని శంకర్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డివిజన్ ప్రజలు ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి