BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు

Select Suryaa Now
దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు

దుబ్బాక;జల్సాలు చేసేందుకు పలుచోట్ల చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు దుబ్బాక సిఐ టి.రాజేష్ తెలిపారు. సోమవారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఎస్సై కీర్తి రాజుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. ఈనెల 20వ తేదీన దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ లో గల ఒక కూల్డ్రింక్ దుకాణం, బస్టాండ్ పైఅంతస్తులోని ఫ్లెక్సీ దుకాణం, పట్టణ శివారులోని మెకానిక్ దుకాణం తాళాలు పగలగొట్టి కూల్డ్రింక్స్, మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, చార్జర్, ప్లంబింగ్ సామాను, కొంత నగదు చోరీ గురైనట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల సహాయంతో చోరీలకు పాల్పడింది పట్టణానికి చెందిన పాత నేరస్తుడు ఎండి. రఫీ అని పోలీసులు గుర్తించారు. సోమవారం మల్లయ్యపల్లి శివారులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న రఫీని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తానే చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుని వద్ద నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్,  చార్జరు, ప్లంబింగ్ సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రఫీని కోర్టులో హాజరు పరిచి, సిద్దిపేట జిల్లా జైలుకు రిమాండ్ కు తరలించారు.