డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్.
సూర్య న్యూస్ ముండ్లమూరు.: గ్రామంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించి ప్రజల మన్ననలను పొందాలని టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కోరారు. మండలంలోని ఉమామహేశ్వరపురం గ్రామ సర్పంచ్ గా వేముల జానకిరామ్ ఏకగ్రీవం అయ్యారు. సర్పంచ్ వార్డు మెంబర్లు సోమవారం డాక్టర్ లలిత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ లలిత్ మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ఏకగ్రీవం కావడానికి సహకరించిన ప్రజల ఆశల అనుగుణంగా పనిచేసే ప్రజల మందమలు పొందాలని ఆయన కోరారు. అనంతరం డాక్టర్ లలిత్ ను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కాటూరి గురవయ్య నీటి సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.