విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ తరఫున నూతనంగా ఎన్నికైన ఎనిమిది మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. వెంకటే గౌడ్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ నూతన కౌన్సిలర్లను ఘనంగా సన్మానించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు కృషి చేయాలని ఆకాంక్షించారు.
అనిల్ కుమార్ యాదవ్