BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు

Select Suryaa Now
అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు

వృద్ధులకు అల్పాహారం, పండ్ల పంపిణీ చేసిన అక్కినేని యువసేన

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య 40వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు టౌన్ అక్కినేని యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువసేన సభ్యులు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి వృద్ధులకు ఆప్యాయతను పంచుతూ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.డి.ఎం. బాషా ఆధ్వర్యంలో స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి వృద్ధాశ్రమంలో ఉదయం అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సమాజంలోని నిరుపేదలు, వృద్ధులకు సహాయం అందించడం ద్వారా స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు టౌన్ అక్కినేని యువసేన గౌరవాధ్యక్షులు గురిజాల సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను, వృద్ధులకు అండగా నిలవాల్సిన సామాజిక బాధ్యతను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో షాషా, అశోక్, ఓబులేసు, భాస్కర్, సాదక్, ప్రవీణ్, బాబా, షఫీ, ఎన్.టి.ఆర్. సుబ్బు, అజ్జు, షాకిర్, బున్, సి. సుబ్బారాయుడు తదితర అక్కినేని యువసేన సభ్యులు పాల్గొన్నారు.