పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి
పొదిలి, మేజర్‌న్యూస్ :
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పొదిలి నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూటమి చైర్మన్ అభ్యర్థి వరికుంట్ల అనిల్ మరియు ఆ అవార్డుల కూటమి వార్డు సభ్యులకు మద్దతుగా పొదిలి పట్టణంలోని 14,15,20,27,వార్డులలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ ఎంపి గారు మాట్లాడుతూ పొదిలి పట్టణం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇదే పొదిలి పట్టణంలో మహిళలపై రాళ్లు వేసిన మీకు చరిత్ర వైసిపి వాళ్ళదని ప్రతిపక్షంలో ఉంటేనే మహిళలపై ఈ విధంగా దాడులు చేస్తున్నారని అది అధికారంలోకి వస్తే వారి అరాచకాలకు హద్దె ఉండదని అన్నారు.
పెన్షన్ 4000 రూపాయలకు పెంచిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదని, మహిళలకు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పలికి వందనం లో సంవత్సరానికి 13 వేల రూపాయలు, రైతులకు అన్నదాత సుఖీభవ తో సంవత్సరానికి 20,000రూపాయలు ఇస్తున్నామని ఈ విధంగా అన్ని రకాల సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.
20 కోట్ల రూపాయల తో పొదిలి పట్టణాన్ని త్వరలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, అతి ముఖ్యమైన పొదిలి పట్టణ త్రాగునీటి సమస్యకు పరిష్కారంగా 130 కోట్ల రూపాయలతో పొదిలి పట్టడానికి ఇంటింటికి ద్వారా త్రాగునీరు వచ్చే ఆరు నెలల్లో అందిస్తామని అన్నారు.
పొదిలి పట్టణంలో మరింత అభివృద్ధి జరగాలంటే కూటమి చైర్మన్ అభ్యర్థిగా వరికుంట్ల అనిల్ కూటమి వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.