ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ
చిట్టమూరు మేజర్ న్యూస్
చిట్టమూరు మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు మరోసారి రెచ్చిపోయారు మండలంలోని పిట్టివానిపల్లి రెవెన్యూ పరిధిలోని ఆక్వాగుంటల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లను పగులు కొట్టి విలువైన సామగ్రిని శనివారం రాత్రి అపహరించుకు వెళ్లారు.బాధితుల కథనం మేరకు . పిట్టివానిపల్లికి చెందిన పిట్టి శ్రీనివాసులుతో పాటు మరో రైతుకు చెందిన రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్లు,ఇతర విలువైన సామగ్రిని అపహరించుకెళ్లారు.ఈ ఘటనలో సుమారు 5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.గతంలోనూ మండల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు చోటుచేసుకుని రైతులను ఆందోళనకు గురిచేశాయి.శనివారం రాత్రి మళ్లీ అదే తరహాలో దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లను అపహరించడం స్థానికంగా కలకలం రేపుతోంది.ఇప్పటికే పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు,మార్కెట్ పరిస్థితులతో సతమతమవుతున్న ఆక్వా రైతులకు ఈ దొంగతనాలు మరింత భారంగా మారాయని వాపోయారు.మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉన్న తమ పరిస్థితికి ఈ ఘటనలు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్