BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు దిగుతూ, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై దాడులు చేయడంపై టీడీపీ నేతల బృందం నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ, హింస ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్. రాజశేఖర్, ఏపీ బయోడైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, టీటీడీ స్థానిక సలహా కమిటీ ప్రెసిడెంట్ కనకమేడల వీరాంజనేయులు ఈ బృందంలో ఉన్నారు. నవంబర్ 22న అనంతపురం జిల్లా యాడికి మండలం, పుప్పాల గ్రామంలో నామినేషన్లు వేసి రాయలచెరువు నుండి తిరిగి వస్తున్న టీడీపీ మద్దతుదారులపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వీరిలో చరణ్ అనే కార్యకర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కమిషన్‌కు అందజేశారు. నవంబర్ 23న గురజాల నియోజకవర్గం, గొట్టిముక్కల గ్రామంలో నామినేషన్లు వేయడానికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ మూకలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డాయి. టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించినప్పటికీ వైసీపీ గూండాలు రెచ్చిపోయి, అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దాడికి యత్నించారు. పోలీసులు ఎంతో శ్రమించి గుంపును చెదరగొట్టారు. నవంబర్ 23న కుందుర్పి మండలం, మలయనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తూ, నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిపైనా, విధుల్లో ఉన్న పోలీసులపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో గాయపడిన వారి ఫోటోలు, వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను ఆధారాలుగా కమిషన్‌కు సమర్పించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కమిషనర్‌ను కోరారు. ఓటర్లలో తిరిగి భరోసా నింపేందుకు దాడులకు పాల్పడిన సంఘవిద్రోహ శక్తులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఈసీని కలిసిన అనంతరం* ఎమ్మెల్సీ వర్ల రామయ్య* మీడియాతో మాట్లాడుతూ..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చేసే విధానాన్ని (మోడస్ ఆపరాండి) మార్చుకుని రాష్ట్రంలో అరాచకాలకు తెరలేపుతున్నారని తీవ్రంగా విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. అక్కడ వైసీపీ నాయకుడు కాసు మహేష్ రెడ్డికి ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదని, అందుకే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడుపై ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు. ఎవరి నియోజకవర్గంలో వారు రాజకీయాలు చేయాలి తప్ప, పక్క నియోజకవర్గ నేతలను తీసుకువచ్చి గొడవలు సృష్టించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేయడానికి వెళుతున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడి చేసి రక్తసిక్తం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ నియోజకవర్గంలో, అలాగే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వంటి వారి ద్వారా దౌర్జన్యాలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రచారానికి వెళ్తున్న తమ రథాలను అడ్డుకుని ధ్వంసం చేయడం, రాళ్లు, పెట్రోల్ బాంబులు, మారణాయుధాలతో దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమేనని మండిపడ్డారు. అడ్డుకున్న పోలీసులపై కూడా రాళ్లు రువ్వడం దారుణమని, ఇలాంటి ఘటనల విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రక్తం కారితేనే జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టేలా ఉంది. దౌర్జన్యాలు చేస్తే ప్రజలు భయపడి ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. సొంత కుటుంబంలోని అన్నాచెల్లెళ్లు, తల్లితో ఉన్న విభేదాలను చక్కదిద్దుకోలేని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, పెద్దల మాటలను సైతం పెడచెవిన పెడుతున్నారని హితవు పలికారు. దొడ్డిదారి రాజకీయాలు మానుకుని, తాను చేసిన సేవలు, కార్యక్రమాల ద్వారా ప్రజలను ఒప్పించి, మెప్పించి రాజమార్గంలో ఓట్లు అడగాలని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చిల్లు పడ్డ కుండలా తయారైందని, ఆ కుండలో నీళ్లు నిలవనట్టే ఆ పార్టీలో ఓటర్లు నిలిచే పరిస్థితి లేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఓటర్లు వైసీపీకి దూరంగా జరిగిపోయారని, మరో నాలుగైదు రోజుల్లో ఆ పార్టీ బండారం పూర్తిగా బయటపడుతుందని అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని, విధానాలను మార్చుకుని ప్రజారంజకంగా వ్యవహరించాలని వర్ల రామయ్య కోరారు.