BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య

Select Suryaa Now
 ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య

పొదిలి, మేజర్‌న్యూస్‌ :

పొదిలి నగర పంచాయతీ ఎన్నికల వేళ 25వ వార్డు బెస్తపాలెంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది.మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు గారి తనయుడు అన్నా కృష్ణచైతన్య గారు పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి వార్డులోని ప్రతి వీధి,ప్రతి ఇంటిని సందర్శిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటరు మహాశయులను నేరుగా కలుసుకొని ఆప్యాయంగా పలకరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును అందించాలని విజ్ఞప్తి చేశారు.పొదిలి నగర పంచాయతీ అభివృద్ధి,ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చైర్మన్ అభ్యర్థి కామూనూరి వెంకటరావు గారితో పాటు 28 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బెస్తపాలెంలోని ప్రతి ఇంటికీ చేరుకుంటూ,ప్రతి ఓటరును కలుసుకుంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కృష్ణచైతన్య గారు ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు.పార్టీ నాయకులు,కార్యకర్తల భాగస్వామ్యంతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.