BREAKING
రష్యా ఉపగ్రహ వార్తలపై నాటో స్పందన శంషాబాద్‌లో కల్తీ మద్యం దందా గుట్టురట్టు! పుష్కరాల పనులను వేగవంతం చేయాలి * నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.. అధికారులకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించడంపై ఎన్విడియాపై చట్టసభ సభ్యుల విమర్శలు ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునరాగమనం ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందేలా చర్యలు అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ ధాన్యం, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి * అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి రవికుమార్ కొలత పట్టకుంటే.. ట్రాఫిక్ నియంత్రణ కష్టమే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి - అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ . నారాయణపురంలో ఆర్కే రాజు ప్రచార హోరు... గెలుపే లక్ష్యంగా ముందుకు. గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ వేడుకల ముందు భారత్-నేపాల్ మధ్య 10 స్తంభాల ఉమ్మడి విజన్

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి - అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం

Select Suryaa Now
ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి  - అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం

 

సూర్య - పెద్దపల్లి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పెద్దబొంకూరులో భూ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని, గోదావరిఖనికి చెందిన దరఖాస్తుదారుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, బోదకాలు బాధితుడికి పెన్షన్ కల్పించాలని, పెంచికల్‌పేట్‌లో అర్హులైన కుటుంబానికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని వచ్చిన దరఖాస్తులపై సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.