BREAKING
రష్యా ఉపగ్రహ వార్తలపై నాటో స్పందన శంషాబాద్‌లో కల్తీ మద్యం దందా గుట్టురట్టు! పుష్కరాల పనులను వేగవంతం చేయాలి * నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.. అధికారులకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించడంపై ఎన్విడియాపై చట్టసభ సభ్యుల విమర్శలు ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునరాగమనం ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందేలా చర్యలు అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ ధాన్యం, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి * అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి రవికుమార్ కొలత పట్టకుంటే.. ట్రాఫిక్ నియంత్రణ కష్టమే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి - అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి డిప్యూటీ మేయర్ పాలడుగు విజయ . నారాయణపురంలో ఆర్కే రాజు ప్రచార హోరు... గెలుపే లక్ష్యంగా ముందుకు. గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ వేడుకల ముందు భారత్-నేపాల్ మధ్య 10 స్తంభాల ఉమ్మడి విజన్

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందేలా చర్యలు అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందేలా చర్యలు  అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి

 

సూర్య - పెద్దపల్లి : అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అందేలా ఖచ్చితమైన వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం రామగిరి మండలం పన్నూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఇందిరమ్మ బీమా నమోదు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబం నుంచి లబ్ధిదారులు, నామినీ వివరాలను ధ్రువీకరణ పత్రాలతో సరిపోల్చి నమోదు చేయాలని, ఏ ఒక్క కుటుంబం మిగిలిపోకుండా చూడాలని సూచించారు. రూ.5 లక్షల బీమా ప్రయోజనం పొందే క్రమంలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా వివరాల్లో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరణించిన ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ఆదేశించారు.
అనంతరం మంథనిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద 2027 పుష్కరాల అభివృద్ధి పనులను పరిశీలించారు. డిజైన్ ఆమోదాలు పెండింగ్‌లో ఉన్న పనులకు వెంటనే అనుమతులు పొందాలని, నిర్మాణ పనులను వేగవంతం చేసి నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు స్నాన సౌకర్యాలు, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, మరుగుదొడ్లు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో రామగిరి తహసీల్దార్ సుమన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.