BREAKING
కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

శంషాబాద్‌లో కల్తీ మద్యం దందా గుట్టురట్టు!

Select Suryaa Now
శంషాబాద్‌లో కల్తీ మద్యం దందా గుట్టురట్టు!

శంషాబాద్ : హైదరాబాద్‌లో కల్తీ మద్యం దందా వెలుగులోకి వచ్చింది. చీప్ లిక్కర్‌ను ప్రముఖ ప్రీమియం బ్రాండ్లైన జానీ వాకర్, డ్యూవర్స్, 100 పైపర్స్ ఖాళీ బాటిళ్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ డిస్టిలరీ కార్మికుడు వంగలి అశోక్ (43), స్క్రాప్ వ్యాపారి మహమ్మద్ యాకూబ్ పాషా (29) ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

అశోక్ ఇంటిపై అధికారులు దాడి చేసి 10 నింపిన మద్యం బాటిళ్లతో పాటు 30కి పైగా ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.560 విలువైన డౌన్‌టౌన్ మద్యాన్ని ప్రీమియం బ్రాండ్ల బాటిళ్లలో నింపి స్థానికంగా సుమారు పది మందికి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ అక్రమ మద్యం కొనుగోలు చేసిన వారిపై కూడా ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు. సీఐ నరేందర్ నేతృత్వంలోని డీటీఎఫ్ బృందం ఈ దందాను ఛేదించడంతో గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ ఉన్నతాధికారులు బృందాన్ని అభినందించారు.

పోతుల నర్సింహా, మేజర్ న్యూస్ శంషాబాద్.