BREAKING
వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో 23 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మన్నూరు అమృతలక్ష్మి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆర్జేసీ ప్రత్యేక పర్యవేక్షణ 512 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి నటుడిగా 51 ఏళ్ల అరుదైన మైలురాయి.. ఘనంగా మోహన్‌బాబు వేడుకలు, తరలివచ్చిన సినీ 47 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ సి మునికృష్ణ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ _2026)ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి పోస్టల్ బ్యాలెట్‌పై కలెక్టర్ ప్రత్యేక నిఘా! కాకినాడ అభివృద్ధికి కూటమిదే భరోసా! డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్.. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ సందడి ప్రకృతి అందాల మధ్య వైద్యుల పక్షుల వీక్షణ!

శ్రీమఠంలో వైభవంగా తెప్పోత్సవం

Select Suryaa Now
శ్రీమఠంలో వైభవంగా తెప్పోత్సవం

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి* 
కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో సోమవారం  శ్రీమఠం నందు గురురాజాంగణంలో శ్రీ స్వామి గోవింద్ దేవ్ గిరి జీ మహారాజ్ నిర్వహించిన భాగవత కథా ప్రవచనాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ పరిమళ తీర్థ పుష్కరిణిలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీమఠ పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ, వ్యాసరాజ మఠ ఉత్తరాధికారి శ్రీ విద్యావిజయ తీర్థులు, శ్రీ స్వామి గోవింద్ దేవ్ గిరి జీ మహారాజ్ పాల్గొని భక్తులకు అనుగ్రహ సందేశాన్ని అందించారు.అయోధ్యతో పాటు ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామీజీల ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల సందడితో తెప్పోత్సవం ఆధ్యాత్మిక వైభవంగా సాగింది.
అంతకుముందు శ్రీమఠం లో శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నిజ బృందావనానికి స్వర్ణ కవచం తో ముస్తాబు చేశారు శ్రీ  మఠం పీఠాధిపతులు శ్రీ సుబ్బదేంద్ర తీర్థులు మహా మంగళహారతి తోపాటు మూలా రాములకు విశిష్ట పూజలు చేపట్టారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*