BREAKING
కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో

కాకినాడ అభివృద్ధికి కూటమిదే భరోసా!

Select Suryaa Now
కాకినాడ అభివృద్ధికి కూటమిదే భరోసా!

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో : 

  • అభివృద్ధి కొనసాగాలంటే కూటమిని గెలిపించాలి
  • మేయర్ అభ్యర్థి ఆకుల భవానికి మద్దతుగా కొండబాబు, చిక్కాల ప్రచారం
  • 5, 9 డివిజన్లలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం

 కాకినాడ నగరం మరింత అభివృద్ధి చెందాలంటే నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సోమవారం కూటమి మేయర్ అభ్యర్థి ఆకుల భవాని, 9వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అంబటి సత్యనారాయణ చిన్న, 5వ డివిజన్ అభ్యర్థి సీకోటి రవణమ్మ అప్పలకొండకు మద్దతుగా సీనియర్ నాయకుడు చిక్కాల రామచంద్రరావుతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతలు, మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నగరాభివృద్ధికి ప్రజలు కూటమి అభ్యర్థులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

సీనియర్ నాయకుడు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు. కాకినాడను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు మేయర్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.