రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన కశింకోట పోలీసులు.
కశింకోట, నవంబర్ 23, మేజర్ న్యూస్: స్థానిక కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని అనకాపల్లి – ఎలమంచిలి జాతీయ రహదారిపై కశింకోట రత్నా నర్సింగ్ హోమ్ సమీపంలో ఆదివారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎలమంచిలి వైపు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కరణం నాగవిజయ (62) అనే మహిళను ఢీకొట్టడంతో ఆమె తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కరణం అనురాధ కశింకోట పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, కశింకోట ఎస్ఐ కె. లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.