దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం
కాకినాడ, మేజర్ న్యూస్ : వందే భారత మాతరం నినాదంతో దేశ భక్తి తో కూడిన దైవ భక్తి ఆవశ్యకత తో సమాజాన్ని జాగృతం చేయడానికి వాస్యల్య భారతి కృషి చేస్తోందని సంస్థ కార్యదర్శి వేదాంతం రామం అన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తిక శుద్ధ త్రయోదశి ని పురస్కరించుకుని కాకినాడ దేవాలయం వీధి లోని బాలాత్రిపురసుందరీ సమేత భీమేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన అభిషేకాలు, రుద్ర, లక్ష్మి, గణపతి, భారతమాత తాత్త్విక హోమాలు, బాలాత్రిపురసుందరి అమ్మవారికి కుంకుమార్చన, భారతమాత ఆరాధన, వేద ఆశ్వీర్వచనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో వాత్సల్యభారతి సంఘటనా కార్యదర్శి మద్దాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత మాత తత్త్వ ప్రచారంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.సంస్ధ సహ కార్యదర్శి డా సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ వాత్సల్యభారతిచే ప్రపంచానికి దేశానికి శాంతి కలగాలని కోరుకుంటూ లోకకల్యాణం కోసం సామూహికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులను సత్కరించారు. రామ్నారాయణ్ పెరుమాళ్ పిఠాధిపతి శృంగారం తిరువెంగళ కృష్ణమాచార్యులు, ప్రవచనకర్త మద్దాలి సత్యనారాయణ మూర్తి కార్తిక మాసం ప్రాముఖ్యత ను వివరించారు. పాలగొమ్మి వేంకటరమణ, దివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.