BREAKING
పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనం..అంతరంగంలోని చీకట్లను తొలగించుకునే పరమ పవిత్ర ఘట్టం 'తూ మిల్ జాయే' షూటింగ్‌లో దీపికా పదుకొణెను ఉత్సాహపరిచిన రణ్‌వీర్ సింగ్.. కొరియోగ్రాఫర్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు ఇవే! 58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి . వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం 'రామాయణ' చిత్రంపై వాటికన్ కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ప్రశంసలు.. సార్వత్రిక సందేశంపై ప్రత్యేక వ్యాఖ్యలు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి నిత్యాన్నదానానికి రూ.20 వేల విరాళం అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఈవో ముంబైలో ఆటో రైడ్, దేశీ థాలీతో 'బ్రిడ్జర్టన్' నటి సిమోన్ యాష్లే సందడి.. ఫొటోలు వైరల్

అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఈవో

Select Suryaa Now
అన్నవరం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ, ఈవో

అన్నవరం, మేజర్ న్యూస్ : కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మంగళవారం (నవంబర్ 24) నిర్వహించనున్న గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు ముందస్తు ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్ రావు గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అధికారులు గిరి ప్రదక్షిణ మార్గమంతా పర్యటించి భక్తుల రాకపోకలు, రహదారి పరిస్థితులు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, అత్యవసర సేవలు తదితర అంశాలను సమీక్షించారు. గిరి ప్రదక్షిణకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ముఖ్యంగా గిరి ప్రదక్షిణలో కీలక ఘట్టాలైన పంపా నది వద్ద నిర్వహించే పంపా హారతులు, రాత్రి సమయంలో స్వామివారి తొలి పావంచాల వద్ద జరిగే జ్వాలాతోరణం కార్యక్రమాల వద్ద భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసు బందోబస్తు, బారికేడ్లు, రాకపోకల నియంత్రణ, అవసరమైన భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు తెలిపారు.
దేవస్థానం ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీకి, పోలీసు అధికారులకు వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున అన్ని శాఖల సిబ్బందిని సమన్వయం చేస్తూ అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో డీఎస్పీ తిలక్, సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐ హరిబాబు, దేవస్థానం ఇంజినీరింగ్ ఈఈ రామకృష్ణ, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
గిరి ప్రదక్షిణ మహోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం, పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.