BREAKING
హే రామ్.. ఆలయాలను కాపాడండి, ఏపీని రక్షించండి: వైఎస్ జగన్ వినికిడి లోపం..చిన్నారుల చదువుకు అడ్డుకాదు -400 మంది దివ్యాంగ విద్యార్థులకు స్విమ్స్‌లో ఉచిత వినికిడి పరీక్షలు -అవసరమైన వారికి ఉచిత హియరింగ్ ఎయిడ్స్..రోజుకు 20 మందికి పరీక్షలు -చిన్నారుల భవిష్యత్తుకు డా.గుడారు జగదీష్ ప్రత్యేక ప్రాధాన్యత రిసార్ట్స్‌లో పోలీసుల దాడి.. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ మూత్రం దుర్వాసన రావడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణమా.. శరీరం ఇచ్చే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి! 'రామాయణ' భారీ విజయం తర్వాత పుట్టపర్తిలో సాయి పల్లవి సందడి.. భక్తితో భజనలు పాడుతూ ప్రార్థనలు పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనం..అంతరంగంలోని చీకట్లను తొలగించుకునే పరమ పవిత్ర ఘట్టం 'తూ మిల్ జాయే' షూటింగ్‌లో దీపికా పదుకొణెను ఉత్సాహపరిచిన రణ్‌వీర్ సింగ్.. కొరియోగ్రాఫర్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పిల్లల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు.. తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు ఇవే! 58వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజారెడ్డి . వరి ధాన్యం, బియ్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా

పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

Select Suryaa Now
పోలవరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
  • కలెక్టర్ కె. దినేష్ కుమార్ 
    రంపచోడవరం సూర్య ప్రతినిధి : పోలవరం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అందుబాటులో ఉన్న సహజ వనరులు, పర్యాటక అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుని స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. తాత్కాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
    అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిపాన్ కోయ ప్రతినిధుల బృందం మాస్టర్ ప్లాన్ వివరించడం జరిగింది. సోమవారం ఐటీడీఏ కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్‌తో పర్యాటక అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించింది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, సిటీ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుల పరిధిలో అమరావతి–ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానంగా ఉన్న మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పర్యాటక అభివృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
    ఈ సందర్భంగా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలో ఇప్పటికే గుర్తించిన పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు, కొత్తగా పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాలకు రహదారి అనుసంధానం, రవాణా సౌకర్యాలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
    రపోలవరం ఐలాండ్ బ్రిడ్జి సమీపంలో పర్యాటక అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రతిపాదన పరిశీలనలో ఉందని, సుమారు 400 ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంక్‌గా గుర్తించినట్లు కలెక్టర్ తెలియ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రాంతాలు, సదుపాయాల ఆధునీకరణతో పాటు ఎక్స్‌ప్రెస్‌వే మార్గానికి అనుసంధానంగా కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు.
    జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనల రూపకల్పనలో జిల్లా యంత్రాంగం తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, జిల్లా పర్యాటక అధికారి దాసు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిపాన్ కోయ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.