జోరుగా ఎన్నికల ప్రచారం
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీ నగరంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. సోమవారం ఉదయం కాకినాడ రేచర్లపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు తమ ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని 8, 9, 16 వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీతో పాటు ఆయా వార్డుల కార్పొరేటర్ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పార్టీ నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న, డాక్టర్ కాద వెంకట రమణతో పాటు పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు