andhrapradesh
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
రంపచోడవరం సూర్య ప్రతినిధి :
- ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి!
- జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి ఐపీఎస్ మాట్లాడారు.వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా యువత రోడ్లపై రేసింగ్‌లు, బైక్ స్టంట్లు చేయకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, రహదారి సూచికలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామాలు విద్యాసంస్థల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ: "కొన్ని నిమిషాలు ముందుగా గమ్యస్థానానికి చేరుకోవడం కంటే క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఎంతో ముఖ్యం. మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు. మీ నిర్లక్ష్యం ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టకూడదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రమాదాలను నివారించండి.. మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడండి" అని జిల్లా ప్రజలకు ఎస్ పి చక్రవర్తి పిలుపునిచ్చారు.