BREAKING
కర్నూలు,పాత కంట్రోల్ రూమ్ దగ్గర గల దామోదరం సంజీవయ్య స్మారక ఉన్నత పాఠశాల నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు" కుటుంబాలకు ఆర్థిక భరోసా! ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి అమెజాన్ భూకేటాయింపుపై పెద్దవేడులో నిరసన ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఎన్నికల దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు. ట్రేపాయిల్ కంపెనీ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి హే రామ్.. ఆలయాలను కాపాడండి, ఏపీని రక్షించండి: వైఎస్ జగన్ వినికిడి లోపం..చిన్నారుల చదువుకు అడ్డుకాదు -400 మంది దివ్యాంగ విద్యార్థులకు స్విమ్స్‌లో ఉచిత వినికిడి పరీక్షలు -అవసరమైన వారికి ఉచిత హియరింగ్ ఎయిడ్స్..రోజుకు 20 మందికి పరీక్షలు -చిన్నారుల భవిష్యత్తుకు డా.గుడారు జగదీష్ ప్రత్యేక ప్రాధాన్యత రిసార్ట్స్‌లో పోలీసుల దాడి.. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ మూత్రం దుర్వాసన రావడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణమా.. శరీరం ఇచ్చే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి! 'రామాయణ' భారీ విజయం తర్వాత పుట్టపర్తిలో సాయి పల్లవి సందడి.. భక్తితో భజనలు పాడుతూ ప్రార్థనలు పిఠాపురంలో భగ్గుమన్న జనసైనికులు కాలేయ వ్యాధిగ్రస్తులకు కొత్త ఆశ.. 'ఇకిర్వో' మందు క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు జోరుగా ఎన్నికల ప్రచారం

రిసార్ట్స్‌లో పోలీసుల దాడి.. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Select Suryaa Now
రిసార్ట్స్‌లో పోలీసుల దాడి.. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

 

కందుకూరు, మేజర్ న్యూస్: ప్యూచర్ సిటీ పరిధిలోని కందుకూరు మండలం ఎన్‌టీఆర్ తండా గ్రామ శివారులోని బన్నీ రిసార్ట్స్‌లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న 13 మందిని కందుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రూ.1,18,650 నగదు, 12 సెల్‌ఫోన్లు, రెండు సెట్ల పేకముక్కలు, ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం (నవంబర్ 22) రాత్రి సుమారు 7 గంటల సమయంలో బన్నీ రిసార్ట్స్‌లో కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో కందుకూరు ఇన్‌స్పెక్టర్ హెచ్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మహేందర్, పోలీసు సిబ్బంది రిసార్ట్స్‌పై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లు, పేకముక్కలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఫామ్‌హౌస్ యజమాని పాత్రపై విచారణ

ఈ వ్యవహారంలో ఫామ్‌హౌస్ యజమాని మిద్దుల ప్రదీప్ రెడ్డి కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఘటనపై కందుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

జూదానికి దూరంగా ఉండాలి:సీఐ వెంకటేశ్వర్లు

ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...ప్రజలకు పలు సూచనలు చేశారు. పేకాట, మూడు ముక్కలాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని, డబ్బులు పందెంగా పెట్టి జూదం ఆడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు. ఎక్కడైనా జూదం లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.
ఈ దాడిలో ఇన్‌స్పెక్టర్ హెచ్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మహేందర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

టి శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా.