BREAKING
పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం. చంద్రగిరిలో ఎమ్మెల్యే నాని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు... శివాలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు మల్లాపురం లో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రసారం. కిట్టాలపాడు నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు.. ఎమ్మెల్యే సమక్షంలో 70 కుటుంబాల చేరిక! మాజీ ఎమ్మెల్యే కలమట ను కలసిన జడ్పిటిసి త్రివేణి. శివాలయాలకు పోటెత్తిన భక్తులు పాతపట్నంలో ఘనంగా శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ఘనంగా ఈదురాపల్లి లో ఉచిత వైద్య శిబిరం. ఘనంగా భగవాన్ సత్యసాయి బాబా 101వ జన్మదిన వేడుకలు.. సిలంబం ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాకుళం విద్యార్థుల పతకాల పంట శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదు మంగళం లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిక.... కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పులివర్తి నాని కిల్లాంలో ఘనంగా సత్యసాయి 101వ జయంతి వేడుకలు..

ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి

Select Suryaa Now
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి

తిరుపతి, మేజర్ న్యూస్:
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి  32 వ డివిజన్ కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి, ఆమె భర్త కిరణ్ కుమార్ లు గజ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సోమవారం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బట్టే వెంకట కీర్తి 32వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు  మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి మాట్లాడుతూ  32వ డివిజన్ పరిధిలో సమస్యల రహిత ఆదర్శవంతమైన డివిజన్ గా చేయడమే తన లక్ష్యమని చెప్పారు. తనపై విశ్వాసంతో తనకు ఓట్లేసి గెలిపించిన 32వ డివిజన్ ప్రజలను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తానని వెంకట కీర్తి తెలిపారు.

H. Dwaraka, staff reporter 

9705347341.