BREAKING
అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఘనంగా ముగిసిన అంతర జిల్లాల కరాటే పోటీలు విశాఖ, విజయవాడ తరహాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తాం 28వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జెన్సెన్ హువాంగ్ రీ-ఎంట్రీపై టెక్ దిగ్గజాల హర్షం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! మినుము, పెసర పంటల్లో అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కొత్తూరు వార్డు మెంబర్లుగా ఏగిరెడ్డి,ద్వారపురెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అమరేశ్వరస్వామి సన్నిధిలో భక్తులకు ప్రసాద వితరణ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎన్నికల అధికారి మక్కువ మేజర్ పంచాయితీకి నామినేషన్ల దాఖలు పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ! పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం.

ఘనంగా భగవాన్ సత్యసాయి బాబా 101వ జన్మదిన వేడుకలు..

Select Suryaa Now
ఘనంగా భగవాన్ సత్యసాయి బాబా 101వ జన్మదిన వేడుకలు..

 

నరసన్నపేట నవంబర్ 23 మేజర్ న్యూస్ : పట్టణంలోని మారుతీనగర్ సత్యసాయి సేవా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జన్మదిన వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం 101 దీపాలతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాయి మందిరంలో ప్రత్యేక సత్యసాయి వ్రతాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మధ్యాహ్నం సుమారు 3 వేల మందికి అన్నప్రసాద వితరణ చేపట్టారు.

అలాగే పట్టణంలోని చిత్రవీధి, పెద్దపేట సత్యసాయి మందిరాల్లోనూ భగవాన్ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు చేపట్టారు.

జన్మదిన వేడుకల ముగింపు సందర్భంగా రాత్రి భక్తుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సత్యసాయి బాబా నామస్మరణతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.