BREAKING
పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం

పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎన్నికల అధికారి

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎన్నికల అధికారి


శ్రీకాకుళం -మేజర్ న్యూస్:

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అర్హులైన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వంశధార ప్రాజెక్ట్ కార్యాలయం, బొందిలిపురం, శ్రీకాకుళం నందు ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఎన్నికల అధికారి జి. శ్రవణ్ కుమార్ ఈరోజు సందర్శించి, అక్కడ జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, బ్యాలెట్ పత్రాల పంపిణీ, ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటింగ్ విధానం మరియు సంబంధిత రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అర్హులైన ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించబడిందని తెలిపారు. కావున అర్హులైన ప్రతి ఉద్యోగి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ తమ ఓటు హక్కును కోల్పోకుండా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఉద్యోగులకు సూచించారు.
ఈ పర్యటనలో ఎంసీసీ నోడల్ అధికారి డాక్టర్ పి. సుధీర్ కుమార్ మరియు అసిస్టెంట్ సిటీ ప్లానర్-II  ఎ. జానకి, కమిషనర్ వెంట ఉండి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం నిర్వహణ మరియు ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.