ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం
-చైర్పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా చింతాడ రవికుమార్ ప్రచారం
ఆమదాలవలస, నవంబర్ 23, మేజర్ న్యూస్ ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో వైసీపీ ఇంటింటా ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ బొడ్డేపల్లిపేట, కళింగనగర్ వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థి మామిడి రమేష్‌కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ విధానాలు, ప్రజలకు అందించిన సేవలను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. చైర్మన్ అభ్యర్థితో పాటు 28 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వార్డు సభ్యులతో పాటు చైర్మన్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.