BREAKING
పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం

మినుము, పెసర పంటల్లో అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి

Select Suryaa Now
మినుము, పెసర పంటల్లో అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి

సీతానగరం నవంబర్ 23 మేజర్ న్యూస్....వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  కృషోన్నతి యోజన (రబీ 2026-27), ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా లచ్చయ్యపేట మరియు కాసాపేట గ్రామాల్లో రైతులకు మండల వ్యవసాయశాఖ అధికారి ఎస్ అవినాష్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు శారద  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అమృత వీణ  పాల్గొని రైతులకు రబీ పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా లచ్చయ్యపేట గ్రామంలో కొంతమంది రైతులకు ఏటీఎంఏ వారి సౌజన్యంతో మినుము విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది.
మినుము, పెసర పంటల్లో మొక్కల ఎదుగుదల, ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం 18-18-18 మరియు 20-20-0-13 వంటి సమతుల్య పోషకాలను సిఫార్సు చేసిన మోతాదులో పిచికారీ చేయడం వల్ల మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయని, పంట ఎదుగుదలకు తోడ్పడుతుందని అధికారులు వివరించారు. పంట దశను బట్టి పోషకాలను వినియోగించాలని సూచించారు. 
మినుము, పెసర పంటల్లో గడ్డి జాతి కలుపు మొక్కలు, వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు, తుంగ వంటి కలుపు మొక్కల వల్ల పంటకు అందాల్సిన పోషకాలు, నీరు, సూర్యరశ్మి అందక మొక్కల ఎదుగుదల తగ్గి దిగుబడిపై ప్రభావం పడుతుందని. కలుపు నివారణకు విత్తిన వెంటనే మొలకెత్తకముందు పెండిమిథాలిన్  30% EC, పంట మొలకెత్తిన అనంతరం కలుపు రకాన్ని బట్టి ఇమాజెథాపైర్  10% SL వంటి మందులను సంబంధిత పంటకు అనుమతించిన విధంగా ఉపయోగించవచ్చని వివరించారు. అలాగే పంట తొలి దశలోనే కలుపు మొక్కలను తొలగించేందుకు అంతరకృషి, అవసరమైన చోట చేతితో కలుపు తీయడం వంటి పద్ధతులు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో  లచ్చయ్యపేట. కాశయ్య పేట గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు తోపాటు గ్రామ వ్యవసాయ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.