అమరేశ్వరస్వామి సన్నిధిలో భక్తులకు ప్రసాద వితరణ
ప్రసాదం పంపిణీ చేసిన కొత్తకోట రామమూర్తి,పట్నాన వసంతకుమార్
సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆధ్యాత్మిక శోభతో అలరారిన అమరేశ్వర ఆలయం
గరుగుబిల్లి, నవంబర్ 23, మేజర్ న్యూస్:పవిత్ర కార్తీకమాసం రెండవ సోమవారo పురస్కరించుకుని గరుగుబిల్లి మండల కేంద్రంలోని శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శిం చుకునేందుకు ఆలయానికి పోటెత్తారు.
ఈపర్వదినాన్ని పురస్కరించుకుని దాతలు కొత్తకోట రామమూర్తి (చంద్రయ్య),పట్నాన వసంతకుమార్ ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రత్యేక ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.దైవదర్శ నం అనంతరం భక్తులకు స్వయంగా ప్రసాదాన్ని అందజేసి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి గరుగుబిల్లిలోని శ్రీఅమరేశ్వర స్వామి ఆలయంలో కొత్తకోట రామ మూర్తి (చంద్రయ్య), పట్నాన వసంత కుమార్ లు భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నారు.కార్తీక సోమవారం వేళ ఆలయంలో భక్తుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల శ్రీఅమరేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు,భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ దాతలు కొత్తకోట రామమూర్తి (చంద్రయ్య),పట్నాన వసంతకుమార్ లను అభినందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనతో పాటు భక్తుల కు అన్నదానం, ప్రసాద వితరణ చేయడం ఎంతో పుణ్యప్రదమని పేర్కొన్నారు.