కొత్తూరు వార్డు మెంబర్లుగా ఏగిరెడ్డి,ద్వారపురెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
- వార్డు సభ్యులుగా ఏగిరెడ్డి సింహాచలం నాయుడు,ద్వారపురెడ్డి అనిల్
- ఏగిరెడ్డి తిరుపతినాయుడు, పెద్దింటి శ్రీధర్,ద్వారపురెడ్డి రమేష్,రవికుమార్
- గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి
గరుగుబిల్లి, నవంబర్ 23, మేజర్ న్యూస్:మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా ఏగిరెడ్డి సింహాచలంనాయుడు, ద్వారపురెడ్డి అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గ్రామ పెద్దలు, ప్రజల ఏకాభిప్రాయంతో ఏగి రెడ్డి సింహాచలంనాయుడు,ద్వారపు రెడ్డి అనిల్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏగిరెడ్డి సింహాచలంనాయుడు, ద్వారపురెడ్డి అనిల్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దింటి శ్రీధర్, జనసేన పార్టీ నాయకులు ఏగిరెడ్డి తిరుపతినాయుడు, ద్వారపురెడ్డి రమేష్,బడే రవికుమార్ లు శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈసంద ర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లు ఏగిరెడ్డి సింహాచలం నాయుడు,ద్వారపురెడ్డి అనిల్ లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వారు స్పష్టం చేశారు.గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజల ఏకాభిప్రాయంతో వీరిద్దరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామానికి చెందిన పలువురు తెలిపారు.గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.అనంతరం గ్రామస్తులు, అభిమానులు వీరిద్దరిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈసందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు మెంబర్లు ఏగిరెడ్డి సింహాచలంనాయుడు, ద్వారపురెడ్డి అనిల్ లు జనసేన పార్టీ నాయకులు ఏగిరెడ్డి తిరుపతినాయుడు, ద్వారపురెడ్డి శంకర్రావు (రమేష్),బడే రవికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దింటి శ్రీధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.