శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదు
-- ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు,బూత్ ఏజెంట్లకు అవగాహన సమావేశం
-- శ్రీకాకుళం డీఎస్పీ సి.హెచ్. ధనుంజయ నాయుడు
శ్రీకాకుళం-మేజర్ న్యూస్:
శ్రీకాకుళం డీఎస్పీ సి.హెచ్. ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక 80 ఫీట్ రహదారి మార్గంలో ఓ ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 21 వార్డులు, శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని 14 వార్డులకు చెందిన ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, బూత్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల నియమ నిబంధనలు, ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.ఎన్నికల ప్రచారం, పోలింగ్ తదితర సమయాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేందుకు అభ్యర్థులు, బూత్ ఏజెంట్లు పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ ధనుంజయ నాయుడు సూచించారు.