కిల్లాంలో ఘనంగా సత్యసాయి 101వ జయంతి వేడుకలు..
నరసన్నపేట నవంబర్ 24 మేజర్ న్యూస్: మండలంలోని కిల్లాం గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాబా బోధనలను స్మరించుకుంటూ, ఆయన ప్రవచించిన మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
అనంతరం గ్రామంలోని పేదలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శిమ్మ లక్ష్మి, చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ ఆర్.బి. రామన్న, మాజీ ఉపసర్పంచ్ పొట్నూరు సత్యనారాయణ, ధర్మాన గణపతిరావు, స్థానిక నాయకులు, సత్యసాయి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.