కిట్టాలపాడు నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు.. ఎమ్మెల్యే సమక్షంలో 70 కుటుంబాల చేరిక!
హిరమండలం నవంబర్ 23 మేజర్ న్యూస్:
హిరమండలం మండలానికి చెందిన కిట్టాలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు సుమారు 70 కుటుంబాలుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల పీఏసీఎస్ అధ్యక్షులు, ఎంపీటీసీ ప్రతినిధి గోళ్ళ సింహాచలం నాయకత్వంలో రాయి కృష్ణ, లబ్బ ముసలయ్య, లబ్బ మొగలింగం, గోంటి చిన్నరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే గౌరవ మామిడి గోవిందరావు (ఎంజీఆర్) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనపై విశ్వాసంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని, అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. కిట్టాలపాడు గ్రామం నుంచి ఒకేసారి సుమారు 70 కుటుంబాలు టీడీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.