BREAKING
అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఘనంగా ముగిసిన అంతర జిల్లాల కరాటే పోటీలు విశాఖ, విజయవాడ తరహాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తాం 28వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జెన్సెన్ హువాంగ్ రీ-ఎంట్రీపై టెక్ దిగ్గజాల హర్షం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! మినుము, పెసర పంటల్లో అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కొత్తూరు వార్డు మెంబర్లుగా ఏగిరెడ్డి,ద్వారపురెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అమరేశ్వరస్వామి సన్నిధిలో భక్తులకు ప్రసాద వితరణ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎన్నికల అధికారి మక్కువ మేజర్ పంచాయితీకి నామినేషన్ల దాఖలు పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ! పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం.

సిలంబం ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాకుళం విద్యార్థుల పతకాల పంట

Select Suryaa Now
సిలంబం ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాకుళం విద్యార్థుల పతకాల పంట

 

నరసన్నపేట నవంబర్ 23 మేజర్ న్యూస్ : విజయవాడలో ఈ నెల 22న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సిలంబం ఛాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణానికి చెందిన శ్రీకృష్ణ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు.

ఈ పోటీల్లో విద్యార్థులు మొత్తం 100 పతకాలు సాధించారు. ఇందులో 50 బంగారు పతకాలు, 30 రజత పతకాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లో రెండు ద్వితీయ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు.

విద్యార్థులకు శిక్షణ అందించి ఈ విజయానికి కృషి చేసిన కోచ్ అవాల చిన్న యాదవ్ ను సినీ పరిశ్రమకు చెందిన ఫైట్ మాస్టర్ రవి రాయల్, ఏపీ సినీ ఇండస్ట్రీ స్టంట్ డైరెక్టర్స్ అండ్ ఫైటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.బాలప్రసాద్ మాస్టర్, సినీ నటుడు డాక్టర్ సుమన్ తల్వార్ అభినందించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండిపెండెంట్ హీరో అవార్డులతో కోచ్‌ను సత్కరించారు.

విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుకుని జిల్లాకు గుర్తింపు తీసుకురావడంపై క్రీడాభిమానులు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
నరసన్నపేటలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు మెమొంటోళ్లు, సర్టిఫికెట్లు కోచ్ ఆవాల చిన్న యాదవ్, ఇతర పెద్దలు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు