షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఎంజీఆర్.
పాతపట్నం నవంబర్ 23,మేజర్ న్యూస్:
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం 25వ శంకుస్థాపన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక సభ్యుల ఆహ్వానం మేరకు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు (ఎంజీఆర్) హాజరై షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, పాతపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.