BREAKING
పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ మలయనూరులో టిడిపి ప్రచార రథం పై దాడి. ధ్వంసమైన బొలెరో వాహనం. సమన్వయంతో పనిచేస్తే గెలుపు: కిమిడి కళా వెంకట రావు సర్పంచ్ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు..సామగ్రిని సిద్ధం చేస్తున్న సిబ్బంది మున్సిపల్ వైస్ చైర్మన్ గా పప్పల మోహన్ కొలువు దీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన పోటీల విజేతలు పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం

చంద్రగిరిలో ఎమ్మెల్యే నాని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు...

Select Suryaa Now
చంద్రగిరిలో ఎమ్మెల్యే నాని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు...

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజక వర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన 90 శాతానికి పైగా సర్పంచ్‌, వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లను తిరస్కరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం సమీపంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జడ్పిటిసి హర్షిత్ రెడ్డి తో కలిసి  మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ల తిరస్కరణ వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల పేరుతో ఎమ్మెల్యే పులివర్తి నాని రూ.29 కోట్లు వసూలు చేశారని, ఒక్కో పంచాయతీకి రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తీసుకున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారని అన్నారు.


ఒక్కో పంచాయతీ లో 10 నుంచి 12 మంది నామినేషన్లు దాఖలు చేసినా అన్నింటినీ తిరస్కరించిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. రిటర్నింగ్‌ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి నామినేషన్లను తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై అప్పీళ్లలో భాగంగా ఆర్డీఓకు సుమారు 700కు పైగా దరఖాస్తులు సమర్పించినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్లు తిరస్కరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమ తిరస్కరణలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాబలంపై నమ్మకం ఉంటే ఎమ్మెల్యే పులివర్తి నాని రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని మోహిత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. గ్రామాల్లో పర్యటిస్తే ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత ఏమిటో ఆయనకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

THANKS & REGARDS
DWARAKA.H
PH.NO:9705347341