శివాలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు
మక్కువ, నవంబర్ 23, ( మేజర్ న్యూస్): ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నా సంకల్పంతో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆదేశాల మేరకు అధిక జనసంచారం కలిగి ఉన్న ప్రాంతాలలో ఆయుర్వేద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండల కేంద్రంలో గల ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో సోమవారం ములక్కాయ వలస గల శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మక్కువ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్, ఐ. మహేష్ , దుగ్గేరు ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ ఇందిర ఝాన్సీల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో ఆలయానికి వచ్చిన భక్తులకు ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతను వివరించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆయుర్వేద మందులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో ఆయా ఆసుపత్రుల సిబ్బంది కూడా పాల్గొన్నారు.