BREAKING
పార్వతీపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత బాలభూపాల నాయుడు.. డిసెంబర్ 1, 2,3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి.... సిఐటియు పిలుపు. కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చ నోట్ల పందేరం..! ఆమదాలవలసలో టిడిపి ముమ్మర ప్రచారం అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ ఆమదాలవలసలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఘనంగా ముగిసిన అంతర జిల్లాల కరాటే పోటీలు విశాఖ, విజయవాడ తరహాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తాం 28వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జెన్సెన్ హువాంగ్ రీ-ఎంట్రీపై టెక్ దిగ్గజాల హర్షం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! మినుము, పెసర పంటల్లో అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Select Suryaa Now
శివాలయాలకు పోటెత్తిన భక్తులు

 

​కోటబొమ్మాళి, నవంబరు 23, మేజర్ న్యూస్: రెండవ కార్తీక సోమవారం సందర్భంగా మండలంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించి, శివనామస్మరణతో ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక నోములు కూడా తోడవడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
​స్థానిక ఉమామల్లేశ్వర స్వామి ఆలయంలో వేదపండితులు మూలమూర్తులకు పంచామృతాలు, పవిత్ర జలాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. కొత్తపేట శివకేశవ పంచాయతన క్షేత్రంలో ప్రధాన అర్చకులు గౌరిశర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. వీటితో పాటు జర్జంగి, సుబ్బరావుపేట, హరిశ్చంద్రపురం, యలమంచిలి, లఖందిడ్డి, గంగరాం, కురుడు, దంత తదితర గ్రామాల శివాలయాల్లోనూ అభిషేకాలు, భక్తి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.