ట్రేపాయిల్ కంపెనీ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి
షాబాద్, నవంబర్ 23: చందన్‌వెల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ట్రేపాయిల్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడటంపై సీఐటీయూ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయో లేదో అధికారులు తనిఖీ చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, చందన్‌వెల్లి క్లస్టర్ కన్వీనర్ అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్, కార్మిక శాఖ అధికారులు పర్యవేక్షణలో విఫలమయ్యారని విమర్శించారు. కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.