BREAKING
పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కొత్తూరు వార్డు మెంబర్లుగా ఏగిరెడ్డి,ద్వారపురెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అమరేశ్వరస్వామి సన్నిధిలో భక్తులకు ప్రసాద వితరణ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎన్నికల అధికారి మక్కువ మేజర్ పంచాయితీకి నామినేషన్ల దాఖలు పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ! పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం. చంద్రగిరిలో ఎమ్మెల్యే నాని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు... శివాలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు మల్లాపురం లో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రసారం. కిట్టాలపాడు నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు.. ఎమ్మెల్యే సమక్షంలో 70 కుటుంబాల చేరిక! మాజీ ఎమ్మెల్యే కలమట ను కలసిన జడ్పిటిసి త్రివేణి. శివాలయాలకు పోటెత్తిన భక్తులు పాతపట్నంలో ఘనంగా శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో

విశాఖ నగర మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన మంత్రి లోకేష్

Select Suryaa Now
విశాఖ నగర మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన మంత్రి లోకేష్

విశాఖపట్నం: విశాఖపట్నం నగర మేయర్ ముక్కా శ్రావణి, కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం పరామర్శించారు. ఆమె తండ్రి, టీడీపీ నేత ముక్కా ముత్యాల నాయుడు శుక్రవారం మృతిచెందారు. ఈ నేపథ్యంలో విశాఖలోని ఆమె నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముక్కా శ్రావణి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముత్యాల నాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. కార్పోరేటర్ గా, టీడీపీ నేతగా, విశాఖ జిల్లా పార్టీ బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా ముత్యాలనాయుడు ప్రజలకు, పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి లోకేష్ వెంట ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చోడె పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గండి బాబ్జి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
******