BREAKING
పట్టణంలో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కొత్తూరు వార్డు మెంబర్లుగా ఏగిరెడ్డి,ద్వారపురెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అమరేశ్వరస్వామి సన్నిధిలో భక్తులకు ప్రసాద వితరణ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన అదనపు ఎన్నికల అధికారి మక్కువ మేజర్ పంచాయితీకి నామినేషన్ల దాఖలు పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ! పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం. చంద్రగిరిలో ఎమ్మెల్యే నాని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు... శివాలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు మల్లాపురం లో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రసారం. కిట్టాలపాడు నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు.. ఎమ్మెల్యే సమక్షంలో 70 కుటుంబాల చేరిక! మాజీ ఎమ్మెల్యే కలమట ను కలసిన జడ్పిటిసి త్రివేణి. శివాలయాలకు పోటెత్తిన భక్తులు పాతపట్నంలో ఘనంగా శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం నూతన పాలనకు శ్రీకారం.

Select Suryaa Now
పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం నూతన పాలనకు శ్రీకారం.

 

ఘనంగా చైర్పర్సన్,కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.

ప్రజల నమ్మకమే నా బలం - చైర్ పర్సన్ గంగాభవాని.

పలాస, నవంబర్ 23,మేజర్ న్యూస్.

పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘ చరిత్రలో మరో నూతన అధ్యాయం సోమవారం ప్రారంభమైంది. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది. పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పుష్ప గుఛ్చాలతో నూతన కార్యవర్గానికి ఘన స్వాగతం పలికారు.

తొలుత ప్రమాణం చేసిన చైర్ పర్సన్ వజ్జ గంగాభవాని.

కార్యక్రమంలో అందరి చూపు ఛైర్‌పర్సన్ ప్రమాణంపైనే నిలిచింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన వజ్జ గంగాభవాని అధికారి సమక్షంలో తొలుత ప్రమాణ స్వీకారం చేశారు."వజ్జ గంగాభవాని అనే నేను... భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, నా కర్తవ్యాన్ని నిష్ఠతో, నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను" అంటూ ఆమె చేసిన ప్రమాణం సభలో హర్షధ్వానాల మధ్య సాగింది.ఆ తర్వాత అక్షర క్రమం ప్రకారం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి ప్రమాణం చేశారు. ప్రతి కౌన్సిలర్ ప్రమాణం చేస్తున్న సమయంలో వారి వార్డు ప్రజలు, అనుచరులు కేరింతలు కొట్టారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి కౌన్సిలర్‌పై ఉందని,పార్టీలకు అతీతంగా, వార్డుల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని,ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలపై తక్షణమే దృష్టి పెట్టాలని అభిప్రాయ పడ్డారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు, వివిధ వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం నూతన ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లను అభిమానులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించడంతో పలాస - కాశీబుగ్గ పట్టణంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమం వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాశీబుగ్గ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.మున్సిపల్ కార్యాలయం రహదారి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇ శ్రీనివాసులు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా.

ప్రమాణ స్వీకారం అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా కోరం లేక పోవడంతో వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్లు చెరుకుపల్లి నాగార్జున, మార్పు అరుణ, సనపల సింహాచలం, వల్లభ పార్వతితో పాటు స్వతంత్ర కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ కౌన్సిల్ భవనానికి వెళ్ళగా కూటమి కౌన్సిలర్లు హాజరు కాకపోవడం,కోరం లేక పోవడం వల్ల వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.