చీడిపూడి సర్పంచ్ అభ్యర్థిగా వరుద రామ్ శేఖర్ నామినేషన్..
సారవకోట నవంబర్ 24 మేజర్ న్యూస్ : మండలంలోని చీడిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వరుద రామ్ శేఖర్ సోమవారం నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. వందలాది మంది అనుచరులు, గ్రామస్తులతో కలిసి చీడిపూడి నుంచి బుడితి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి ఉత్సాహంగా పయనమయ్యారు.
ఈ సందర్భంగా వరుద రామ్ శేఖర్ మాట్లాడుతూ చీడిపూడి పంచాయతీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు మెరుగైన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ సహకరించి తనకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు.