కాంగ్రెస్ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పటాన్ చెరు;నూతన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమితులైన బి.ఎం.సందీప్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సమష్టి కృషి చేయాలని గాలి అనిల్ కుమార్ కోరారు.పార్టీ నాయకులు,కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేలా కార్యాచరణ రూపొందించాలని నూతన ఇన్‌చార్జ్‌ను కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు,ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తూ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగాలని గాలి అనిల్ కుమార్ ఆకాంక్షించారు. నూతన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం.సందీప్ నాయకత్వంలో పార్టీ మరింత పటిష్టంగా ఎదగాలని,ఆయన నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని గాలి అనిల్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.