BREAKING
వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో 23 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మన్నూరు అమృతలక్ష్మి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆర్జేసీ ప్రత్యేక పర్యవేక్షణ 512 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి నటుడిగా 51 ఏళ్ల అరుదైన మైలురాయి.. ఘనంగా మోహన్‌బాబు వేడుకలు, తరలివచ్చిన సినీ 47 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ సి మునికృష్ణ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ _2026)ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి పోస్టల్ బ్యాలెట్‌పై కలెక్టర్ ప్రత్యేక నిఘా! కాకినాడ అభివృద్ధికి కూటమిదే భరోసా! డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్.. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ సందడి ప్రకృతి అందాల మధ్య వైద్యుల పక్షుల వీక్షణ!

గిరిజన రైతులు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు

Select Suryaa Now
గిరిజన రైతులు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు

- పీఓ జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ 
రంపచోడవరం సూర్య ప్రతినిధి : సోమవారం రంపచోడవరం లోని సిరిగిందలపాడు ఉద్యానవన శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఐటీడీఏ,ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్,జిల్లా హార్టీ కల్చర్ అధికారి దేవదానం, పీహెచ్ఓ నరేంద్ర కుమార్,కె వి కే సైన్సిస్టులు గోవర్ధన్, రాజేంద్రప్రసాద్ లు గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో  ఉద్యానవన   గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వ్యవసాయ పనుల్లో శ్రమ, సమయం తగ్గించడంతో పాటు రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు రాయితీపై యంత్ర పరికరాలను అందించడం జరిగిందని,గిరిజన రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి,యంత్ర పరికరాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. గిరిజన రైతులకు మినీ టిల్లర్లు, తైవాన్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాలను 90% రాయితీ సబ్సిడీపై అందజేసీనట్లు,పోలవరం జిల్లాలో గిరిజన రైతులకు 32 పవర్ టిల్లర్లు అందించడం జరిగిందని  ఒక్కొక్క పవర్ టిల్లర్  ధర 1,24,440 రూపాయలు , ప్రభుత్వం రాయితీ లక్ష రూపాయలు, రైతు కట్టవలసిన వాటా 24,440 రూపాయలు అని ఆయన తెలిపారు. అదేవిధంగా తైవాన్ స్ప్రేయర్లు  300 ఒక్కొక్క యూనిట్ ధర 16,830 రూపాయలు,  అదేవిధంగా 15, 147 రూపాయలు రాయితీపై అదేవిధంగా  1683 రూపాయలు రైతులు కట్టవలసి ఉన్నదని జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
అదేవిధంగా బ్యాటరీ స్ప్రేయర్లు  4000  ఒక్కొక్క యూనిట్ ధర 4,794 రూపాయలని ప్రభుత్వ సబ్సిడీపై 4,314 రూపాయలు, రైతులు కట్టవలసిన వాటా 480  రూపాయలు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీ ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని జేసీ తెలిపారు. ఏజెన్సీలోని ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ  రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడే విధంగా ఈ రాయితీలు సద్వినియోగపరచుకొని మంచి వ్యవసాయం చేయాలని రైతులను ,అదేవిధంగా రానున్న రోజుల్లో రైతులకు ఐటీడీఏ ద్వారా జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మరిన్ని ప్రోత్సాహాలతో  వ్యవసాయం కొరకు తోడ్పాటును  అందించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ మాట్లాడారు.అనంతరం పవర్ టిల్లర్లు లబ్ధిదారులకు  పవర్ టిల్లర్ల తాళాలు అందజేసి రిబ్బన్ కట్ చేసి  ఏ విధంగా  పవర్ టిల్లర్లతో దున్నుచున్నది డెమోను జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు .ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లాలోని గిరిజన రైతులకు వ్యవసాయ పనుల్లో కూలీల ఖర్చు సమయం మరియు శారీరక శ్రమ తగ్గడంతో పాటు పంటల సంరక్షణ మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా జీడి మామిడి, మామిడి,కూరగాయలు మరియు ఇతర ఉద్యన పంటల సాగులో యాంత్రికరణను ప్రోత్సహించి గిరిజన రైతులు తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో  సబ్ అసిస్టెంట్లు శేఖర్, బాబు నాగరాజు, నూకరాజు, చిట్టిబాబు, భీమన్న, సత్యనారాయణ, రవిచంద్ర, సౌజన్య, కిరణ్ చంద్, గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు.