BREAKING
కట్టంగూర్ పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ-ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, 13 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన కొట్టే రుక్మిణమ్మ ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా మూడేసి వికెట్లతో సత్తా బ్యాలెట్ ఓటింగ్ పరిశీలించిన సబ్ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు. కివీస్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. ఆ కార్యక్రమం రద్దు చేసిన గిల్ సేన దేశభక్తి వికాసం వాత్సల్య భారతి ఆశయం పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌-ఏ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి.. పూర్తి సమీకరణం ఇదే మేయర్ ను ఆలింగనం చేసుకున్న'పులుగోరు ' సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. లిటన్ దాస్ కెప్టెన్, నహిద్ రానా దూరం బుట్టాయిగూడెం శివాలయాలకు పోటెత్తిన భక్తులు వేంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన పి. శోభారాణి నామినేషన్ దాఖలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర పరాభవం.. సెంచూరియన్ వేదికగా చెత్త రికార్డు నమోదు ఉపలోకాయుక్త కుటుంబ సమేతంగా పూజలు ఆత్మీయంగా కౌగిలించుకున్న షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో

పోస్టల్ బ్యాలెట్‌పై కలెక్టర్ ప్రత్యేక నిఘా!

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్‌పై కలెక్టర్ ప్రత్యేక నిఘా!
  • స్మార్ట్ సిటీ హాల్‌లో ఓటింగ్ ఏర్పాట్ల పరిశీలన
  • ఓటు గోప్యత, బ్యాలెట్ పత్రాల భద్రతకు ప్రాధాన్యం
  • ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాలు

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అర్హులైన ఓటర్లకు కల్పించిన సదుపాయాలు, ఓటింగ్ నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్హుడైన ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. బ్యాలెట్ పత్రాల పంపిణీ నుంచి ఓటు నమోదు, సంబంధిత పత్రాల నిర్వహణ వరకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఓటు గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాలెట్ పత్రాల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ఓటర్లకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.